ఢిల్లీలోని ప్రసిద్ధ జామా మసీదు లోకి ఒంటరి మహిళలకు ప్రవేశం లేదంటూ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను అదేరోజు వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగానూ, సోషల్ మీడియాలోనూ చెలరేగిన విమర్శలకు తలొగ్గిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మసీదు పెద్దలకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. మసీదుకు వచ్చే ఒంటరి అమ్మాయిలు, అబ్బాయిలను కలవడానికి రావడం, దీన్ని పార్క్‌గా భావించడం, డ్యాన్సులు చేయడం వంటివి వాటిని తాము అనుమతించమని జామా మసీదు పీఆర్‌ఓ నిన్న అన్నారు.