అవతార్ సిరీస్‌లో సెకండ్ పార్ట్‌గా వస్తున్న ‘అవతార్ – ద వే ఆఫ్ వాటర్’ టీజర్‌ను ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ధియేటర్లలో ప్రత్యేకంగా ఈ టీజర్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 160 భాషల్లో ఈ టీజర్‌ను డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు సమాచారం. 2009లో వచ్చిన అవతార్ మూవీకి కొనసాగింపుగా ఈ అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీ తెరకెక్కింది. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తున్నారు.