జమ్మూ డిజిపి లోహియా దారుణ హత్య

By udayam on October 4th / 6:24 am IST

జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) హేమంత్ లోహియా ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆయనను గొంతు కోసి చంపేశారని పోలీసులు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా జమ్మూ కశ్మీర్​ పర్యటన మొదలైన తర్వాత డిజిపిని హత్య చేయడంపై అక్కడి భద్రతా ప్రమాణాలపై మరోసారి జాతీయ స్థాయి చర్చ మొదలైంది. హేమంత్ లోహియా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఈయన మరణానంతరం పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల కిందటే ఐపీఎస్ అధికారి హేమంత్ లోహియా జమ్మూ కశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు. నగర శివార్లలోని ఉదయవాలాలో ఆయన నివాసం ఉంటున్నారు.

ట్యాగ్స్​