బిజెపి–టిడిపి పొత్తుకు పవన్​ ప్రయత్నాలు!

By udayam on May 23rd / 5:42 am IST

ఆంధ్రప్రదేశ్​లో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బిజెపి–టిడిపిలను పొత్తుకు ఒప్పించడానికి జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ నడుం కట్టారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చమని పదే పదే చెబుతున్న ఆయన బిజెపి–జనసేన–టిడిపి పొత్తు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ విషయమై బిజెపి అధినాయకత్వంతోనూ చర్చలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన బిజెపితో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే పార్టీ టిడిపితో 2014లోనూ పొత్తు పెట్టుకుని ఆపై బయటకొచ్చేసింది.

ట్యాగ్స్​