వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఈ మేరకు త్వరలోనే ఏపీలో భారాస రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భారీ ఎత్తున చేరికల్ని జరపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జనసేన కీలక నేత అయిన తోట చంద్రశేఖర్ రావు కు గేలం వేసిన ఆయన భారాసా లో చేరితో రాష్ట్ర అధ్యక్షుడి హోదా ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన భారాసా చేరడం దాదాపుగా ఖాయమైందని ఈరోజే చేరిక జరగొచ్చని టాక్.