పవన్​: తెలంగాణలోనూ పోటీకి సై

By udayam on May 21st / 5:56 am IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ఎపిలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్న వైసీపీ నాయకుల సవాల్​ను స్వీకరిస్తున్నానని చెప్పారు. లక్షల కోట్లను దేశం దాటించగల ఈ నాయకులు జనాలకు మాత్రం మేలు చేయరని వ్యాఖ్యానించారు. ఎపిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఆయన మరోసారి పేర్కొన్నారు.

ట్యాగ్స్​