నాదెండ్ల : జనసేన ఎందుకు రౌడీ సేన?

By udayam on November 21st / 12:19 pm IST

జనసేన పార్టీని రౌడీసేన అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అనడంపై నదెండ్లానోహర్ తీవ్రంగా స్పందించారు. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తుచేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా? జనసేన ఎందుకు రౌడీసేన? అని నాదెండ్ల నిలదీశారు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను, వీర మహిళలను, జనసైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను వెల్లడి చేస్తున్నాయి అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ట్యాగ్స్​