ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్.. కొరటాలతో తన తర్వాతి చిత్రానికి హీరోయిన్ ను ఫైనలైజ్ చేసినట్లు టాక్. బాలీవుడ్ నయా దివా జాన్వీ కపూర్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జాన్వీకి తారక్ అంటే చాలా ఇష్టం, అలానే ఆమె ఎప్పటినుండో సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆశగా ఎదురుచూస్తుంది. దీంతో ఆమెనే యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.