ఉత్తరకొరియా క్షిపణితో ఉలిక్కి పడ్డ జపాన్​..

By udayam on October 4th / 6:30 am IST

బాలిస్టిక్​ క్షిపణులను పేలుస్తూ పొరుగు దేశాలను కలవరపాటుకు గురిచేసే ఉత్తర కొరియా తాజాగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్​ క్షిపణి జపాన్​ మీదుగా ప్రయాణించింది. దీంతో ఈ ప్రయోగాన్ని జపాన్​ ప్రధాని పుమియో కిషిడా తీవ్రంగా ఖండించి.. దీనిని హింసాత్మక ప్రవర్తనగా పేర్కొన్నారు. జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని సైతం నిర్వహించారు. ఈ మిస్సైల్ ప్రయాణ సమయంలో హొక్కైడో ద్వీపంలోని ప్రజలంతా తమను తాము కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రైళ్ల రాకపోకలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది జపాన్​.

ట్యాగ్స్​