జపాన్​లో పెరుగుతున్న కొవిడ్​ మరణాలు

By udayam on December 26th / 7:46 am IST

కరోనా ఉధృతి మరోసారి పెరుగుతున్న వేళ తూర్పు దేశం జపాన్​ లో ఒకరోజు అత్యధిక కొవిడ్​ మరణాలు సంభవించాయి. ఆదివారం ఒక్కరోజే ఈ దేశంలో 371 మంది పౌరులు కరోనాతో కన్నుమూశారు. 2020 లో కరోనా మొదలైన తర్వాత జపాన్​ లో నమోదైన ఒకరోజు అత్యధిక కరోనా మరణాల సంఖ్య ఇదే. ఈ దేశంలో ఇప్పటి వరకూ 8 కరోనా వేవ్​ లు వచ్చాయి. ఇప్పటివరకూ కరోనా కారణంగా ఒకరోజు అత్యధిక మరణాలు జపాన్​ లో 347 మాత్రమేనని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్​ 2 న సంభవించాయి.

ట్యాగ్స్​