12 లక్షలు పెట్టి మరీ కుక్కలా మారిన మనిషి

By udayam on May 26th / 5:01 am IST

వెర్రికి వెయ్యి తలలంటే ఇదే.. జపాన్​కు చెందిన ఓ డబ్బున్న వ్యక్తి తనను తాను కుక్కలా మార్చుకోవాలనుకున్న ఆశను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. ఇందుకోసం టోకో ఇవీని అనే వ్యక్తి ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. అయితే అతడు ఎలాంటి ఆపరేషన్​ చేయించుకోలేదు కానీ జెప్పెట్​ అనే ఓ సంస్థ సాయంతో అచ్చం కోలీ జాతి శునకంలా మేకప్​ వేయించుకున్నాడు. ఇతడు ‘కుక్కలా మారిన’ ఫొటోలు ప్రస్తుతం ఆన్​లైన్​లో వైరల్​గా మారాయి. ఎన్ని రోజులు ఇతడు ఇలా కుక్కలా ఉంటాడన్నది మాత్రం చెప్పలేదు.

ట్యాగ్స్​