కాకినాడలో పండిన మియాజాకీ మామిడి

ధర కేజీ రూ.లక్ష

By udayam on June 3rd / 9:34 am IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి కాకినాడ జిల్లాలో పండింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు తన పొలంలో పండిస్తున్న ఈ మామిడికి అంతర్జాతీయ మార్కెట్​లో భలే గిరాకీ ఉంది. కేజీ మామిడి ధర రూ.1 లక్షగా ఉంటుంది. కింగ్​ ఆఫ్​ మ్యాంగోగా గుర్తింపు ఉన్న ఇది జపాన్​లోని మియాజాకీ ప్రాంతంలోనే మూలాలు ఉండడంతో దీనికి మియాజాకీ అంటారు. బయటకు సువాసనలు వెదజల్లుతూ లోపల బంగారం వర్ణంతో మెరిసిపోతూ చూడడానికే వావ్​ అనిపించేలా ఉంటుందీ ఫలం.

ట్యాగ్స్​