ఈనెల 10 నుంచి శ్రీలంక తో జరగనున్న 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టులో చోటు దక్కింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని బుమ్రా టి20 వరల్డ్ కప్ కూడా దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించిన బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. వన్డే జట్టులో రోహిత్, గిల్, కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, షమి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ లకు చోటు దక్కింది.