రేపటి నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ నుంచి భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఇంకా అతడు పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ నుంచి భారత జట్టు నుంచి దూరమైన అతడు తిరిగి వచ్చేశాడన్న ఆనందం కొద్ది రోజులు కూడా నిలబడలేదు. అతడి స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేయనుంది టీమిండియా.