ట్రైలర్ : బతకడమే కష్టం అంటున్న జయమ్మ

By udayam on May 4th / 11:05 am IST

యాంకర్​ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్​ను సూపర్​ స్టార్​ మహేష్​ బాబు రిలీజ్​ చేశాడు. పల్లెటూరి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సుమ పలకించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. జబ్బుపడ్డ భర్తకు ఎలాగైనా ఆపరేషన్​ చేయించాలనుకునే సగటు ఇల్లాలిగా, ఎదిగిన కూతురిని ఓ యువకుడి బారి నుంచి ఎలా కాపాడుకున్నదీ.. ఈ ట్రైలర్​లో చూపించారు. ‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 6న ఈ మూవీ రిలీజ్​ కానుంది.

ట్యాగ్స్​