భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సష్టించాడు. 3 ఓవర్లలో 6 వికెట్లు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఉనద్కత్ రెచ్చిపోయాడు. అతడు వేసిన ఫస్ట్ ఓవర్లోనే హ్యాట్రిక్ నమోదు చేసిన అతడు మొత్తంగా 12 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఉనద్కత్ దెబ్బకు దెబ్బకు ఢిల్లీ కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది.