కర్ణాటకలో సాధారణ ఎన్నికలు జరగడానికి మరో 6 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్ష జేడీఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఈసీ నోటిఫికేషన్ రావడానికి మరో 5 నెలలు పట్టే అవకాశం ఉన్నా.. కుమార స్వామి మాత్రం అప్పుడే 93 మందికి తమ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్లను విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈసారి కర్ణాటక ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్న కుమారస్వామి.. ఆ ప్రణాళికలో భాగంగానే అందరి కంటే ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.