నింగిలోకి మరో ప్రయాణికుడు

By udayam on July 20th / 5:33 am IST

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ ఈరోజు తన బ్లూ ఆరిజన్​ స్పేస్​ రాకెట్​లో అంతరిక్ష యాత్రకు బయల్దేరుతున్నాడు. ఈ తొలి కమర్షియల్​ స్పేస్​ ట్రావెల్​ రాకెట్​లో బెజోస్​తో పాటు అతడి తమ్ముడు మార్క్​ బెజోస్​, 82 ఏళ్ళ వాలీ ఫంక్​, 18 ఏళ్ళ డచ్​ విద్యార్థి ఓలివర్​ డీమెన్​లు వెళ్తున్నారు. అయితే వీరందరిలో ఓలివర్​ మాత్రమే టిక్కెట్​ కొనుక్కుని అంతరిక్షయాత్ర చేస్తున్న తొలి ప్రయాణికుడు. ఈ యాత్రపై స్పందించిన బెజోస్​ ‘చాలా ఆతృతగా ఉంది. మేమంతా దీనికోసం సిద్ధంగా ఉన్నాం’ అని వివరించాడు.

ట్యాగ్స్​