వయసు తగ్గించే కంపెనీకి బెజోస్​ ఫండింగ్​

By udayam on September 14th / 8:01 am IST

ప్రపంచ కుబేరుడు, అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ తాజాగా వయసును తగ్గించే పరిశోధనలకు డబ్బును సమకూరుస్తున్నాడు. ఇప్పటికే టెక్​ కంపెనీలతో పాటు అంతరిక్ష కంపెనీలు కూడా ఉన్న ఆయన ఎన్నటికీ మరణం రానటువంటి జీవితాన్ని గడపడానికే తన నిధుల్లో కొంత భాగాన్ని వెచ్చిస్తున్నాడు. ఇందుకోసం అల్టోస్​ ల్యాబ్​ చేస్తున్న రీప్రోగ్రామింగ్​ సెల్స్​ పరిశోధనకు ఫండింగ్​ చేస్తున్నాడు. మానవ శరీరంలోని కణజాలానికి మరింత శక్తినిచ్చేలా ఈ ఆల్టోస్​ ల్యాబ్​లో పరిశోధనలకు జరుగుతున్నాయి. ఈ కంపెనీకి బెజోస్​ 1 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ చేశాడు.

ట్యాగ్స్​