అంతరిక్షం చుట్టొచ్చిన బెజోస్​

By udayam on July 21st / 5:43 am IST

భూమి మీద అపర కుబేరుడు జెఫ్​ బెజోస్​ ప్రపంచంలోనే తొలి కమర్షియల్​ అంతరిక్ష రాకెట్​ ద్వారా రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. తనకే చెందిన బ్లూ ఆరిజిన్​ అంతరిక్ష సంస్థ తయారు చేసిన న్యూ షెపర్డ్​ క్యాప్సూల్​లో ఆయన ఈ యాత్రను పూర్తి చేశాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.11 గంటలకు బయల్దేరిన ఈ రాకెట్​ భూమి నుంచి 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని 10 నిమిషాల అనంతరం నిర్దేశించిన స్థలంలో ల్యాండ్​ అయ్యారు. బెజోస్​తో పాటు ఆయన తమ్ముడు మార్క్​, 18 ఏళ్ళ విద్యార్థి ఒలివర్​, 82 ఏళ్ళ వాలీ ఫంక్​ సైతం ఈ యాత్రలో పాల్గొన్నారు.

ట్యాగ్స్​