భూమి టూరిస్ట్​ గ్రహంగా మారుతుంది : బెజోస్​

By udayam on November 19th / 4:59 am IST

భవిష్యత్తులో అంతరిక్షంలోని వేరే గ్రహాల్లో జన్మించే వారికి భూమి ఓ టూరిస్ట్​ ప్రదేశంగా మారుతుందని అమెజాన్​ అధిపతి జెఫ్​ బెజోస్​ వ్యాఖ్యానించారు. బ్లూ ఆరిజిన్​ సంస్థ పేరిట గ్రహాంతర ప్రయాణాలకు పరీక్షలు జరుపుతున్న ఆయన ఇకపై మానవజాతికి భూగ్రహం మాత్రమే ప్రాథమిక ప్రాంతంగా ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం టూరిస్టులు అమెరికాలోని యెల్లోస్టోన్​ నేషనల్​ పార్క్​ను ఎలా అయితే సందర్శిస్తున్నారో భవిష్యత్తులో మనుషులు భూమిని అలాగే సందర్శిస్తారని పేర్కొన్నారు. మనుషులు మల్టీ ప్లానెటరీ జీవులుగా మారతారని ఆయన జోస్యం చెప్పారు.

ట్యాగ్స్​