మూడేళ్ళుగా మూతబడ్డ జెట్ ఎయిర్వేస్ తన సేవల్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. గురువారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ విమానయాన సంస్థ తొలి టెస్ట్ ఫ్లైట్‌ను నిర్వహించింది. చివరి సారిగా ఈ సంస్థ 2019 ఏప్రిల్ 17న తన చివరి విమాన ప్రయాణాన్ని జరిపింది. అనంతర పరిణామాల మధ్య ఈ సంస్థను జలన్–కాల్రోక్ కన్సార్టియంలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్ రాకతో దేశీయ విమానయాన సంస్థలకు ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.