రష్యా భీకర దాడితో శవాలదిబ్బగా మారిన ఉక్రెయిన్లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆకస్మిక పర్యటన జరిపారు. మాతృదినోత్సవం వేళ ఆమె ఉక్రెయిన్ రాజధాని క్యీవ్కు చేరుకుని తమ మద్దతు ఈ దేశానికి కొనసాగుతూనే ఉంటుందని చెప్పకనే చెప్పారు. ‘అత్యంత క్రూరంగా సాగుతున్న ఈ యుద్ధం ఈ క్షణమే ఆగిపోవాలని కోరుకుంటున్నా. అమెరికా పౌరులందరి ప్రార్థనలు ఉక్రెయిన్ వాసులకు అందివ్వడానికే నేనొచ్చింది’ అని జిల్ బైడెన్ విలేకరులతో అన్నారు.