కల్తీ మద్యం తాగి బీహార్ లో 40 మంది చనిపోవడంపై ఆ రాష్ట్ర సిఎం నితీష్ కుమార్ కొంచెమైనా బాధను వ్యక్తం చేయలేదు. సరికదా మద్యం తాగితే ఇలానే చస్తారు అంటూ మృతుల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేశారు. మద్యం తాగడంపై ప్రజలు మరింత అప్రమత్తతో ఉండాలని.. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధంపై మరింత లోతైన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు.