రెండేళ్ళ తర్వాత జట్టులోకి వచ్చిన ఆర్చర్​

By udayam on December 22nd / 11:31 am IST

దాదాపు రెండేళ్ళ పాటు గాయాలతో జట్టుకు దూరమైన ఇంగ్లాండ్​ యువ పేసర్​ జోఫ్రా ఆర్చర్​ తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్​ ల వన్డే సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో ఆర్చర్​ కు చోటు దక్కింది. 2019 వన్డే వరల్డ్​ కప్​ తర్వాత నుంచి గాయాలకు గురవుతూ జట్టులోకి ఇలా వచ్చి.. అలా వెళ్తున్న ఈ 27 ఏళ్ళ ససెక్స్​ పేసర్​ తాజాగా పూర్తి ఫిట్​ నెస్​ సాధించాడు. 2021 మార్చిలో అహ్మదాబాద్​ లో భారత్​ తో జరిగిన టి20 మ్యాచ్​ నే అతడు ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​.

ట్యాగ్స్​