ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ జోషిమఠ్ పై సంచలన నివేదిక ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రాంతం ప్రతీ ఏటా ఆరున్నర సెంటీమీటర్ల వరకూ భూమిలోకి కుంగిపోతోందని ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు తేల్చారు. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతూనే ఉన్నాయని తెలిపారు. టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పుల వల్లే ఇక్కడి భూమి కుంగుపాటుకు గురవుతున్నట్లు తేల్చారు. జోషిమఠ్ లో పగుళ్లు వచ్చిన పలు ఇళ్లు, హోటళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకరంగా మారిన పలు కట్టడాలను మంగళవారం నిపుణుల బృందం గుర్తించింది. కూల్చివేయాల్సిన నిర్మాణాలకు క్రాస్ మార్క్ చేసింది.