ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్​ హైదరాబాద్​లో

By udayam on September 14th / 11:59 am IST

ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్​మెంట్​ బ్యాకింగ్​ కంపెనీ జెపి మోర్గాన్​ తన కార్యాలయాన్ని హైదరాబాద్​లో లాంచ్​ చేసింది. ఇది ఆసియా పసిఫిక్​ ప్రాంతంలోనే ఆ కంపెనీకి అతిపెద్ద కార్యాలయంగా నిలవనుంది. సాలార్​పురియా సత్వా నాలెడ్జ్​ సిటీలో దాదాపు 8.22 లక్షల అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించింది. ‘మా వ్యాపారంలో హైదరాబాద్​కు ఉన్న ఉన్నత స్థానం ఇస్తున్నాం. ఇక్కడి నుంచే మా ప్రపంచ స్థాయి క్లయింట్ల కోసం సర్వీస్​ చేస్తాం. ఇది ఇక్కడి ప్రజలకు మేం ఇస్తున్న గౌరవం’ అంటూ ఆ సంస్థ పరిపాలనా అధికారి డేనియెల్​ విల్కికినింగ్​ అన్నారు.

ట్యాగ్స్​