బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జయప్రకాష్ నడ్డాను 2024 జూన్ వరకూ కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు నడ్డాల నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోగలమనే ధీమా తమకు ఉందని అమిత్ షా వెల్లడించారు. 2019లో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నడ్డా 2020లో పూర్తి కాలపు అధ్యక్ష పదవిని చేపట్టారు. మంగళవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.