తారక్ దుబాయ్ ట్రిప్ పూర్తయింది

By udayam on November 19th / 12:30 pm IST

స‌మ‌యం దొరికితే చాలు విహార‌యాత్ర‌కు వెళ్లడం సెల‌బ్రిటీల‌కు కొత్తేమి కాదు. అయితే ఈసారి లాక్‌డౌన్‌లో మాత్రం షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో బ‌య‌ట అడుగు కూడా పెట్ట‌కుండా ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో జాలీగా గడిపేశారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి.

మ‌రికొంద‌రేమో షూటింగ్స్ ప్రారంభించ‌డానికి ముందు వెకేష‌న్‌కు వెళ్లేందుకు ప్లానులు వేసుకుంటున్నారు. అలా ఎంతోమంది న‌టీన‌టులు ఇత‌ర‌ ప్ర‌దేశాలు చుట్టొస్తున్నారు.

ఇందులో భాగంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు దీపావ‌ళికి ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కు వెళ్లారు. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’‌ సినిమా నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.

ఫ్యామిలీతో కల్సి  దుబాయ్‌కు వెకేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ‌ ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డిపిన‌ ఎన్టీఆర్ వారం రోజుల త‌ర్వాత‌  తిరిగి హైద‌రాబాద్‌కు చేరారు. విమానాశ్ర‌యంలో కొడుకు అభ‌య్ రామ్ చేయి ప‌ట్టుకుని న‌డుస్తున్న హీరో ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఎన్టీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌ణ‌తి కూడా ఉన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై దృష్టి పెట్టనున్నాడు.