20 నుంచి ఓటిటిలో ఆర్​ఆర్ఆర్​ స్ట్రీమింగ్​!

By udayam on May 4th / 11:25 am IST

జక్కన్న రాజమౌళి చెక్కిన ఆర్​ఆర్​ఆర్​ ఓటిటి స్ట్రీమింగ్​ కు సిద్ధమైంది. లాంగ్​ రన్​లో రూ.1200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఈనెల 20 నుంచి జీ5, నెట్​ఫ్లిక్స్​లలో స్ట్రీమింగ్​ కానుందని తెలుస్తోంది. అయితే దీనిని పే పర్​ వ్యూ పద్దతిలో స్ట్రీమ్​ చేస్తారన్న టాక్​ వినిపిస్తోంది. వచ్చే నెల 3 నుంచి మాత్రం ఆయా ప్లాట్​ఫామ్స్​ సబ్​స్క్రైబర్లకు ఫ్రీగానే స్ట్రీమింగ్​ కొనసాగుతుంది.

ట్యాగ్స్​