కేక పుట్టిస్తున్న జూ.ఎన్టీఆర్ కొత్త లుక్

By udayam on November 22nd / 10:20 am IST

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు యాడ్స్ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఇటీవల బాద్ షా లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో లుక్ తో ఆకట్టుకున్నాడు.ఈ లుక్ లో ఎన్టీఆర్ కళ్లజోడుతో ..బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించాడు. ఒక వైపు సీరియస్ గా లుక్ పెట్టడంతో అందరూ ఇది సినిమా షూటింగ్ ఫోజు అని అనుకుంటున్నారు. కానీ ఓ బ్రాండ్ ను ప్రకటన చేయడానికి ఈ లుక్ ఇచ్చాడని అంటున్నారు.

ట్యాగ్స్​