జూ.ఎన్టీఆర్​ : ఎన్టీఆర్​ పేరు మారిస్తేనే.. వైఎస్​ఆర్​ స్థాయి పెరుగుతుందా?

By udayam on September 22nd / 10:26 am IST

ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ పేరును డా.వైఎస్​ఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ఎపి సర్కార్​ మార్చడంపై నటుడు జూ.ఎన్టీఆర్​ ధ్వజమెత్తారు. ఈ మేరకు జగన్​ సర్కార్​ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్​ చేశారు. ‘ఎన్టీఆర్​, వైఎస్​ఆర్​ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్​ఆర్​ స్థాయిని పెంచదు, ఎన్​టిఆర్​ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్​ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలను చెరిపేయలేదు’ అంటూ ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు.

ట్యాగ్స్​