సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఎన్​వి రమణ

By udayam on April 6th / 11:01 am IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారైన జస్టిస్​ ఎన్​వి రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత చీఫ్​ జస్టిస్​ ఎస్​ఎ బాబ్డే ఈనెల 23న రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఆయనే ఎన్​వి రమణ పేరును తన వారసునిగా కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్​వి రమణనే ఆ పదవికి ఎంపిక చేస్తూ ఈరోజు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనెల 24న ఆయన దేశ చీఫ్​ జస్టిస్​గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్యాగ్స్​