తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న సీజే సతీష్ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం ఈ బదిలీలను సిఫార్సు చేసింది. ఈయనతో పాటు ఉత్తరాఖండ్ సీజేగా విపిన్ సంగిని, హిమాచల్ ప్రదేశ్ సీజెగా అంజాద్ సయీద్‌ను, రాజస్థాన్ సీజేగా ఎస్.ఎస్.షిండేను, గుజరాత్ సీజేగా రాష్మిన్ చాయను కొలీజియం నియమించింది.