ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణలో గత వారం తనపై జరిగిన దాడిని అమిత్ షాకు వివరించిన ఆయన తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించాలని కోరారు. కేసీఆర్ అవినీతిపైనా విచారణ జరిపించాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఎపి అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరితే.. తెలంగాణ అప్పు రూ.4.5 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిని అమిత్ షా ఖండించారని చెప్పారు.