కాంగ్రెస్​కు కపిల్​ సిబాల్​ రాజీనామా

By udayam on May 25th / 9:23 am IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్​ సిబాల్​ ఆ పార్టీకి గుడ్​ బై చెప్పేశారు. ఆ వెంటనే సమాజ్​ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ స్థానానికి నామినేషన్​ కూడా దాఖలు చేశారు. ‘ఈనెల 16నే నేను కాంగ్రెస్​కు రాజీనామా ఇచ్చేశా. చింతన్​ శివిర్​ సమావేశానికి నాకసలు ఆహ్వానమే లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అసలే వరుస పరాజయాలతో పార్టీ ఉనికినే కోల్పోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్​కు కపిల్​ రాజీనామా నిజంగా పెద్ద షాకే.

ట్యాగ్స్​