200ల వికెట్ల క్లబ్​లోకి రబాడ

By udayam on May 14th / 6:14 am IST

సౌత్​ ఆఫ్రికా పేస్​ సంచలనం కసిగో రబాడ టి20 క్రికెట్​లో అరుదైన మైలు రాయికి చేరుకున్నాడు. నిన్న ఐపిఎల్​లో బెంగళూరుపై విజృంభించిన ఈ పంజాబ్​ పేసర్​ 3 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో 146 మ్యాచ్​ల టి20 కెరీర్​లో రబాడ 200ల వికెట్ల మార్క్​ను చేరుకున్నాడు. అతడి కంటే ముందు రషీద్​ ఖాన్​ 134 మ్యాచుల్లోనూ, పాక్​ స్పిన్నర్​ అజ్మల్​ 139 మ్యాచుల్లోనూ ఈ మార్క్​ను చేరుకున్నాడు. ఉమర్​ గుల్​ 147 మ్యాచులు, మలింగ 149 మ్యాచుల్లోనూ 200 వికెట్లు కూల్చారు.

ట్యాగ్స్​