తమిళనాడులో కలైమామణి అవార్డుల పదానం

By udayam on February 21st / 6:22 am IST

చెన్నై: సినీ, నాటక, సంగీత, సాహితీ రంగాల్లో విశిష్ట సేవల్ని అందిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కలైమామణి అవార్డులను ప్రకటించింది.

2019, 2020 సంవత్సరానికి ఈ అవార్డులకు ఎంపికైన వారి వివరాలను సమాచారశాఖ విడుదల చేసింది. ఇందులో సరోజాదేవి, పి సుశీల, షావుకారు జానకీలకు ప్రత్యేకంగా పురట్చి తలైవి జయలలిత కలైమామణి అవార్డులను ప్రకటించారు.

ప్రతి ఏటా పై రంగాల్లో విశిష్ట సేవల్ని అందిస్తున్న వారికి ప్రభుత్వం కలైమామణి అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. 2019లో కరోనా పుణ్యమాని గత ఏడాది జాబితా వెలువడలేదు.

దీంతో 2019తో పాటు 2020 సంవత్సరా నికి కలైమామణి అవార్డులకు ఎంపికైన వారి వివరాలను ప్రకటించారు.

సినీ, నాటక రంగం, సాహితీ రంగం, బుల్లి తెర అంటూ విశిష్ట సేవల్ని అందించిన కళామ్మతల్లి బిడ్డలకు కలైమామణి అవార్డులను ప్రకటించారు.

అలాగే పురట్చి తలైవి జయలిత పేరిట ప్రత్యేక కలైమామణి అవార్డు, భారతీ, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, బాల సరస్వతి, సీనియర్‌ కలైమామణి బిరుదలకు ఎంపికైన వారి వివరాలతో ఈ జాబితాను ప్రకటించారు. ఇందులో సీని రంగానికి చెందిన 41 మంది ఇందులో ఉన్నారు.

శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేష్‌లకు కలైమామణి…

2019లో సినీనటుడు రామరాజన్, సంగీత దర్శకుడుదీన, దర్శకుడు లియాఖత్‌ అలీ ఖాన్, హాస్య నటుడు యోగిబాబు, హాస్యనటి దేవ దర్శిని, పాట రచయిత కామకోడియన్, కెమెరా మ్యాన్‌ రఘునాథ్‌ రెడ్డి, 2020కి నటుడు శివకార్తికేయన్, నటి ఐశ్వర్య రాజేష్‌, సంగీత దర్శకుడు ఇమాన్, పాటల రచయిత కాదల్‌ మది, హాస్యనటి మధుమిత, నిర్మాత ఐషరీ గణేష్‌, మాటల రచయిత ప్రభాకర్,తదితరులు సెలక్ట్ అయ్యారు.