కవిత: ఎంపీ అరవింద్​ ను సెంటర్లో చెప్పుతో కొడతా

By udayam on November 18th / 7:58 am IST

నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ పై టిఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఫైర్​ అయ్యారు.తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ పేరును అరవింద్ పాడుచేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేసిన ఆమె.. తాను కాంగ్రెస్​ లోకి వెళ్ళేందుకు ఖర్గేతో మాట్లాడానన్న ఆయన ఆరోపణలు అవాస్తవమన్నారు. కాంగ్రెస్ తో కలిసి గెలిచింది నువ్వు.. బురదమీద రాయి వేయకూడదని ఊరుకున్నా.. రాజకీయాలు చెయ్.., పిచ్చి వేషాలు వేయకు అని తీవ్ర పదజాలంతో కవిత ఫైర్​ అయ్యారు.

ట్యాగ్స్​