కళ్యాణ్​ రామ్​ అమిగోస్​ నుంచి రెండో లుక్​

By udayam on January 3rd / 11:30 am IST

కల్యాణ్ రామ్ ‘బింబిసార’ హిట్ తరువాత మంచి ఊపు మీద ఉన్నాడు. ‘బింబిసార’ సీక్వెల్ కి ముందు ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటిగా ‘అమిగోస్’ రూపొందింది. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కల్యాణ్ రామ్ కనిపించనున్నట్టు చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కల్యాణ్ రామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చాలా సాఫ్ట్ లుక్ తో .. చాలా పద్ధతిగా పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే నెల 10న విడుదల కానుంది.

ట్యాగ్స్​