అజిత్ తో వలిమై, తలా 62, తూనివు, నేర్కొండ పార్వై వంటి బ్లాక్ బస్టర్లు తీసిన డైరెక్టర్ హెచ్.వినోత్ తో విశ్వనటుడు కమల్ హాసన్ సినిమా కన్ఫర్మ్ అయింది. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో కమల్ తో పాటు నటించనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన విక్రమ్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో మనం చూశాం. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ను వినోత్ రిపీట్ చేయనుండడం ఫ్యాన్స్ కు కన్నుల పండగనే చెప్పాలి. విక్రమ్ హిట్ తర్వాత కమల్ తన దూకుడును కొనసాగిస్తున్నారు. భారతీయుడు 2తో పాటు మణిరత్నంతో ఓ సినిమాను, మాలిక్ మూవీ ఫేమ్ మహేష్ నారాయణన్ తో మరో మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు.