లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘స్వాతిముత్యం’ , ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ వంటి క్లాసికల్ చిత్రాలు వచ్చి పలు అవార్డ్స్ అందుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలు బుల్లితెర ఫై ప్రసారమైతే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అందుకుంటాయి. అలాంటి వీరిద్దరూ కలిశారు. తాజాగా, హైదరాబాద్ వచ్చిన కమల హాసన్ నేరుగా విశ్వనాథ్‌ను ఇంటికెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కమల హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, గురువుగారిని వాళ్లింట్లో కలిసి, ఎన్నో మధురస్మృతులను గుర్తుచేసుకున్నామని తెలిపారు.
కళా తపస్వి కె.విశ్వనాథ్ ను కలిసిన విశ్వనటుడు కమల్ హాసన్#KamalHassan #Viswanath pic.twitter.com/YM9tUvFR3I
— Udayam News Telugu (@udayam_official) November 23, 2022