కమల్ కాలుకి సర్జరీ

హెల్త్ బులిటెన్ రిలీజ్

By udayam on January 19th / 12:10 pm IST

చెన్నై : విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత క‌మ‌ల‌హాసన్‌ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామ‌చంద్ర ఆస్పత్రిలో చేరారు.

దీంతో ఆయన కాలికి వైద్యులు శస్త్ర‌ చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుప‌త్రి వైద్యులు మంగళవారం క‌మ‌ల్‌‌ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.

కుడి కాలు బోనుకి స్వల్ప ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా క‌మ‌ల్‌ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు ఆ బులిటెన్ లో పేర్కొన్నారు. కాలికి స‌ర్జరీ చేశాక, కమల్‌ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు.

కమల్‌ కోలుకుంటున్నార‌ని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు.

మరోవైపు త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గరపడుతున్న నేప‌థ్యంలో క‌మ‌ల‌హాస‌న్ కొన్ని నెల‌లుగా ప్రజల మధ్య తిరగడమే పనిగా పెట్టుకున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టి, త‌మ పార్టీ అభ్యర్థుల ఎంపిక‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై కమల్‌ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు.