అనారోగ్యంతో బుధవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన అగ్రనటుడు కమల్ హాసన్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. అన్ని పరీక్షలు చేసిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కమల్ కు వైద్యులు సూచించారు. అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. కమల్ అనారోగ్యం వార్త అభిమానులను కలవరానికి గురి చేసింది. బుధవారం హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా కమలహాసన్, తన గురు సమానులైన దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ ను కలుసుకోవడం తెలిసిందే. అదే రోజు రాత్రి చెన్నైకి తిరిగి వెళ్లిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.