ప్రముఖ మలయాళీ దర్శకుడు, మాలిక్ వంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శఖుడు మహేష్ నారాయణన్ తో.. విశ్వనటుడు కమల్ హాసన్ నటించాల్సిన మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. ఈ మూవీని కమల్ హాసన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే నిర్మిస్తారని కూడా ప్రకటనలు వచ్చాయి. 1992లో కమల్ నటించిన క్షత్రియ పుత్రుడు కు కొనసాగింపుగా ఈ మూవీ వస్తుందని ప్రచారం జరిగింది.
#KamalHassan’s film with Mahesh Narayanan has been shelved.
The project was supposed to be a continuation of Thevar Magan.
— Haricharan Pudipeddi (@pudiharicharan) December 7, 2022