ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సపోర్టింగ్ స్టాఫర్ కమలేశ్ జైన్‌కు బంపరాఫర్ తగిలింది. అతడిని టీమిండియా హెడ్ ఫిజియోగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ద్రవిడ్, లక్ష్మణ్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో అతడు వారిద్దరినీ మెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో చీఫ్ ఫిజియోగా కమలేశ్ నియామకం ఇక పక్కా అనే తెలుస్తోంది. మాజీ ఫిజియో నితిన్ పటేల్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా వెళ్ళడంతో అతడి స్థానాన్ని కమలేశ్‌తో భర్తీ చేయనున్నారు.