కేన్​ మామ డబుల్​ సెంచరీ.. 612 కు డిక్లేర్డ్​ చేసిన న్యూజిలాండ్​

By udayam on December 29th / 12:12 pm IST

పాకిస్థాన్​ తో జరుగుతున్న తొలి టెస్ట్​ లో న్యూజిలాండ్​ మాజీ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ డబుల్​ సెంచరీతో చెలరేగిపోయాడు.395 బాల్స్​ లో 200* చేసిన అతడికిది కెరీర్లో 5వ డబుల్​ సెంచరీ కాగా.. న్యూజిలాండ్​ బ్యాటర్లలో ఎవరికీ ఇన్ని డబుల్​ సెంచరీలు లేకపోవడం విశేషం. 4వ రోజు ఆటలో కేన్​ మామ ఇన్నింగ్స్​ తో పాటు అతడికి టామ్​ బ్లండెల్​ 47, ఇష్​ సోధి 65 తో సహకరించారు. దీంతో న్యూజిలాండ్​ జట్టు 612/9 వద్ద ఇన్నింగ్స్​ ను డిక్లేర్డ్​ చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్​ వద్ద 174 పరుగుల ఆధిక్యం ఉంది.

ట్యాగ్స్​