ఐపిఎల్ మినీ వేలంలో సీనియర్ ఆటగాళ్ళు తమ తమ పాత జట్లకు దూరమై కొత్త జట్లకు దగ్గరయ్యారు. హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు హైదరాబాద్, అజింక్యా రహానేను చెన్నై రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. జో రూట్ ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓడియన్ స్మిత్ రూ.50 లక్షలకు పంజాబ్ దక్కించుకోగా.. జింబాబ్వే టాప్ ప్లేయర్ సికిందర్ రాజాను రూ.50 లక్షలకు పంజాబ్ నే కొనేసింది.