రేపటి నుంచి ప్రారంభం కానున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇరు జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్ లో సరదా ఘటన చోటు చేసుకుంది. కప్ ను ఓ చిన్న టేబుల్ పైన ఉంచి ఇరు జట్ల కెప్టెన్లు వెనుక నిలబడి ఫొటోలకు పోజులిస్తుండగా.. గాలులు బలంగా వీచాయి. దీంతో ఈ టేబుల్ కింద పడిపోతుంటే కేన్ విలియమ్సన్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కప్పును క్యాచ్ పట్టుకున్నాడు. భారత కెప్టెన్ హార్ధిక్ పాండ్య టేబుల్ పడకుండా అడ్డుకున్నాడు. ఆ పై నిర్వాహకులు గాలి వేగం తగ్గిన తర్వాత ఫొటో సెషన్ ను నిర్వహించారు.
Nice save by Kane 😂pic.twitter.com/CA1gKvdMOT
— Out Of Context Cricket (@GemsOfCricket) November 16, 2022