బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలకు టాప్ యాక్ట్రెస్ కంగన రనౌత్ మద్దతు తెలిపింది. తన చిత్రం ప్రమోషన్లో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘మహేష్ చెప్పింది నిజం. టాలీవుడ్ లాంటి ఇండియాలో నెంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోను బాలీవుడ్ అఫోర్డ్ చేయలేదు. మహేష్ చెప్పిందీ అదే. అయితే ఇది చాలా చిన్న విషయం. దీనిని ఇక్కడి వారు జీర్ణించుకోలేక దాన్నొక పెద్ద సమస్యగా చూపుతోంది. మహేష్ చాలా పెద్ద స్టార్’ అని చెప్పుకొచ్చింది.